Stock market: లాభాల్లో మొదలైన మార్కెట్ సూచీలు..! 3 d ago
దేశశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రధాన స్టాక్స్ లో కొనుగోళ్లకు మధుపర్లు ఆసక్తి చూపడంతో షేర్లు పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ 150 పాయింట్లు పెరగ్గా,నిఫ్టీ 23,750 పైన మొదలుపెట్టింది. ఉదయం 9:35 సమయంలో సెన్సెక్స్ 151 పాయింట్లు పెరిగి, 78,656 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 23,786 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్దఉంది.